ASHES TEST: ఇంగ్లాండ్ క్రీడాకారిణి డబుల్ సెంచరీ, ఆధిక్యంలో ఆస్ట్రేలియా

tammy beamont

tammy beamont

శనివారం 3వ రోజు ఆట ముగిసేసరికి 92 పరుగుల ఆధిక్యం సాధించింది

మహిళల ఏకైక యాషెట్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. శనివారం 3వ రోజు ఆట ముగిసేసరికి 92 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 463 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా వికెట్‌ నష్టపోకుండా 82 పరుగులు చేసింది.

అయితే 3వ రోజు ఆటలో ఇంగ్లాండ్ క్రీడాకారిణి బీమంట్స్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయింది. పట్టుదలతో ఆడి తన కెరీర్‌లో గుర్తుండిపోయేలా 208 పరుగులు సాధించి, ఇంగ్లాండ్ తరఫున ఈ మైలురాయి సాధించిన మొదటి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 88 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ క్రీడాకారిణి స్నోబాల్ చేసిన అత్యధిక పరుగుల రికార్డు 195 పరుగులను కూడా అధిగమించింది. అలాగే మహిళల క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ కొట్టిన క్రీడాకారుణుల్లో 8వ స్థానంలో నిలిచింది. అత్యధిక స్కోర్‌ సాధించిన క్రీడాకారిణుల్లో 5వ స్థానంలో నిలిచింది.


3వ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌ఉమెన్ బీమంట్స్, నాట్‌ స్కైవర్ బ్రంట్‌లు ధాటిగా ప్రారంభిచారు. వీరిద్దరూ కలిసి 3వ వికెట్‌కి 137 పరుగుల భాగస్వామ్యం అందించి ఇంగ్లాండ్‌కి మంచి ఆరంభం అందించారు. ఈ క్రమంలో టీ సమయానికి ఇంగ్లాండ్ 6 వికెట్లకు 428 పరుగులు చేసి ఆధిక్యం దిశగా వెళ్లెంది.

టీ తర్వాత బీమంట్స్ తన డబుల్ సెంచురీ మార్క్‌ని దాటి రికార్డు సృష్టించింది. కీలక సమయంలో అద్భుతంగా బౌలింగ్‌ వేసిన ఆస్ట్రేలియా బౌలర్లు వెనువెంటనే వికెట్లు తీశారు. కీలకమైన బ్రంట్, సోఫియా వికెట్లు తీసిన ఆశ్లే గార్డెనర్ త్రీ వికెట్లు తీయగా, డార్సీ బ్రౌన్, ఎల్లీస్ పెర్రీ చెరో వికెట్ సాధించారు.

ఈ రోజు ఇంగ్లాండ్ చేసిన 463 పరుగులు, టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక స్కోర్‌గా నమోదైంది. ఇంతకు ముందు 1998 లో చేసిన 414 పరుగులే అత్యధికంగా ఉండేది.

Tags

Read MoreRead Less
Next Story