T20 World Cup: టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఆ అద్భుతం జరగాల్సిందేనా..?

T20 World Cup (tv5news.in)

T20 World Cup (tv5news.in)

T20 World Cup: క్రికెట్ అంటే ఒక ఎమోషన్‌గా భావిస్తారు స్పోర్ట్స్ లవర్స్.

T20 World Cup: క్రికెట్ అంటే ఒక ఎమోషన్‌గా భావిస్తారు స్పోర్ట్స్ లవర్స్. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతే.. చిన్నపిల్లల్లా కన్నీళ్లు పెట్టుకునే వారు కూడా ఉన్నారు. ఒకవేళ అదే టీమిండియా గెలిస్తే.. మన ఇంట్లో వారి గెలుపులాగా సంబురాలు చేసుకుంటారు. కానీ టీ20 వరల్డ్ కప్ విషయంలో టీమిండియా ఫ్యాన్స్‌కు ఆ అవకాశం అసలు కనిపించట్లేదు. భారత్ ఇక టీ20 వరల్డ్ కప్ రేస్‌లో నిలవడం కష్టమే అనిపిస్తోంది.

ఆదివారం న్యూజిలాండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో టీంఇండియాకు మరో ఓటమి ఏదురైంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో దాయాదుల పోరులో ఘోర ఓటమిని చవిచూసిన టీంఇండియాను కివీస్‌ కోలుకోలేని దెబ్బకొట్టింది. దీంతో భారత్‌ సెమిస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్‌ సెమిస్‌ వెళ్లడం కష్టంగా మారింది

అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టు ఫ్లాప్‌ షోతో సెమిస్‌ సంక్లీష్టం చేసుకుంది. ఆదివారం మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యచేధనలో కివీస్‌ జట్టు కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది.

టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటికే భారత్ రెండు ఓటమిలను చవిచూసింది. ముందుగా పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన భారత్.. ఆదివారం న్యూజిలాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా రాణించలేకపోయింది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో భారత్ చివరి నుండి రెండో స్థానానికి చేరుకుంది. టేబుల్‌లో మనకంటే ముందు పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, నమీబియా ఉన్నాయి. టాప్ 2 టీమ్‌లు సెమీస్‌కు చేరుతాయి. సెమీస్‌కు చేరడానికి టీమిండియాకు మిగిలింది ఒక్క అవకాశం మాత్రమే.

సెమీస్‌కు చేరాలంటే భారత్ జట్టుకు ఉన్న చివరి అవకాశంలో గెలిచినా.. సెమీస్ ఆశలు కనుమరుగవుతున్నట్టుగానే కనిపిస్తోంది. కానీ ఒకవేళ ఈ అద్భుతాలు జరిగితే మాత్రం.. టీమిండియా సెమీస్‌కు చేరుకోవచ్చు. న్యూజిలాండ్‌ను ఆఫ్గనిస్తాన్ ఓడించాలి. టీమిండియా.. ఆఫ్గనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్‌పై విజయం సాధించాలి. అంతే కాకుండా ఈ గెలుపులో రన్ రేట్, స్కోర్ కూడా ముఖ్యమే. ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్, న్యూజిలాండ్ కంటే ఇండియాకు ఎక్కువ రన్ రేట్ ఉండాలి.

ఒకవేళ ఇలా జరిగితే.. ఇండియా సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఒకప్పుడు ఏ టీమ్‌ను అయినా ఎదురెళ్లి ఓడించే భారత్ జట్టు.. మొదటి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌తో ఓడిపోవడమే ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇక న్యూజిలాండ్‌తో ఓటమి వారికి కోలుకోలేని దెబ్బగా మారింది. కనీసం ఎలాగైనా భారత్ సెమీస్‌కు చేరుకుంటే చాలు అనుకునే పరిస్థితి వచ్చేసింది.

Tags

Read MoreRead Less
Next Story