Cricket: మళ్లీ పెళ్లాడనున్న హార్దిక్ పాండ్య..

Cricket: మళ్లీ పెళ్లాడనున్న హార్దిక్ పాండ్య..
రెండో సారి పెళ్లికి సిద్ధమైన హార్దిక్... పెళ్లి కూతురు ఎవరంటే....

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య మళ్లీ పెల్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని ఘనంగా వివాహమాడబోతున్నాడు. అదేంటి అబ్బాయి చెప్పాపెట్టకుండా మొదటి భార్య నటాషాకు విడాకులు ఇచ్చేసి, మళ్లీ పెళ్లికి కూడా రెడీ అయిపోయాడా అని విపరీతాలకు పోకండి. విషయం ఏమిటంటే... అబ్బాయి తన భార్య నటాషానే మళ్లీ వివాహమాడబోతున్నాడట. 2020లో సింపుల్ గా కోర్టులో వివాహం కానిచ్చేసిన హార్దిక్, నటాషాలకు సంప్రదాయ బద్దంగా మరోసారి తమ బంధాన్ని పటిష్ఠం చేసుకోవాలనిపించిందట. అందుకే ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకుని వేద మంత్రాల నడుమ, అందరి ఆశీర్వాదంతో మరోసారి పెళ్లి వచనాలు చేసుకోబోతున్నారట. రండో సారి అని తేలిగ్గా తీసుకోకుండా అన్నీ పద్ధతిగా జరిగేట్లు ప్లాన్ చేసుకున్నారట ఈ చూడచక్కని జంట. ఈ మేరకు ఈరోజు నుంచే పెళ్లి పనులు మొదలయ్యాట. ఈ వేడుకలు ఫిబ్రవరి 16 వరకూ కొనసాగనున్నాయి. హల్దీ, మెహిందీ, సంగీత్ ఇలా ఏ ఒక్క సంప్రదయాన్ని విడిచిపెట్టకుండా అన్ని ఘట్టాలను నిర్వహించనున్నారు. ఉదయ్ పూర్ లోని ఓ ఖరీదైన ప్యాలెస్ లో ఈ వివాహ వేడుక చోటుచేసుకోబోతోందట. ఈ మేరకు రెండు కుటుంబాలూ ఇప్పటికే ఉదయ్ పూర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాహ వేడుకకు క్రికెట్, సినీ ప్రముఖులు హాజరవ్వనున్నారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story