GT vs DC: ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం

GT vs DC: ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం
సుదర్శన్‌, మిల్లర్‌ పోరాటం వృథా

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య ఉత్కంఠపోరు నడిచింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు టెన్షన్ నెలకొంది. చివరకు ఢిల్లీ గెలుపొందింది. 4 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం నమోదు చేసుకుంది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. చివర్లో రషీద్ ఖాన్ సూపర్ గా ఆడినప్పటికీ గుజరాత్ ఓటమి పాలైంది. గుజరాత్ బ్యాటింగ్ లో వృద్ధిమాన్ సాహా (39), గిల్ (6), సాయి సుదర్శన్ (65) పరుగులతో రాణించాడు. మిల్లర్ (55) పరుగులతో రాణించినప్పటికీ గుజరాత్ ఓడిపోయింది. చివర్లో రషీద్ ఖాన్ (21) పరుగులతో రాణించినప్పటికీ విజయం సాధించలేదు. సాయి కిషోర్ (13), షారూఖ్ ఖాన్ (8), రాహుల్ తెవాటియా (4) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్ లో రషీక్ సలాం 3 వికెట్లతో చెలరేగాడు. కీలకమైన సమయంలో మిల్లర్ వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్ట్జే తలో వికెట్ సంపాదించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్ (88*) పరుగులతో రాణించాడు. అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ అక్షర్ పటేల్ కూడా (66) పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరును చేయగలిగింది. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో పృథ్వీ షా (11) పరుగులు, జేక్ ఫ్రేసర్ (23), షాయ్ హోప్ (5), చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (26) పరుగులతో రాణించాడు. గుజరాత్ బౌలింగ్ లో కేవలం సందీప్ వారియర్ 3 వికెట్లతో చెలరేగాడు. నూర్ అహ్మద్ ఒక వికెట్ తీశారు. మిగతా బౌలర్లంతా వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story