RP Singh : ఆర్పీ సింగ్ ఇంట విషాదం..!

RP Singh : ఆర్పీ సింగ్ ఇంట విషాదం..!
కరోనా మహమ్మారి కారణంగా మరో క్రికెటర్ తన తండ్రిని కోల్పోయాడు. భారత మాజీ ఫేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు.

కరోనా మహమ్మారి కారణంగా మరో క్రికెటర్ తన తండ్రిని కోల్పోయాడు. భారత మాజీ ఫేసర్ ఆర్పీ సింగ్ తండ్రి శివ ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అర్పీ సింగ్ భాగోద్వేగానికి లోనయ్యాడు. కాగా ఇప్పటికే క్రికెటర్లు పియూష్ చావ్లా, చేతన్ సకారియా కరోనాతో తమ తండ్రులను కోల్పోయారు. 2007 టీ20 ప్రపంచకప్ లో సభ్యుడైన ఆర్‌పి సింగ్, భారత్ తరుపున 14 టెస్టులు, 58 వన్డేలు, 10 ట్వంటీ 20 మ్యాచ్ లు ఆడాడు. ఇక 2018లో 32 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు ఆర్పీ సింగ్.


Tags

Read MoreRead Less
Next Story