రెండో పోరుకు సిద్ధమైన కోహ్లీసేన.. టీమ్‌ను వేధిస్తున్న గాయాలు

రెండో పోరుకు సిద్ధమైన కోహ్లీసేన.. టీమ్‌ను వేధిస్తున్న గాయాలు
కీలకమైన రెండో వన్డేకు ముందు ఇంగ్లాండ్‌కు పెద్ద షాక్‌ తగిలింది.

తొలివన్డేలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన కోహ్లీసేన రెండో పోరుకు సిద్ధమైంది. ఇవాళ జరిగే మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టి... సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే టెస్ట్, టీ-ట్వంటీ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లోనూ గెలవడం ద్వారా సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే రెండు జట్లను గాయాలు వేధిస్తున్నాయి.

అయితే రిజర్వ్ బెంచ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆటగాళ్ల విషయంలో టీమ్‌ఇండియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒక్కో స్థానానికి ముగ్గురు నలుగురు పోటీపడుతున్నారు. అందుకే శ్రేయస్‌ అయ్యర్‌ జట్టుకు దూరమైనా పెద్దగా ఇబ్బందుల్లేవ్ . ఆ ప్లేస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ అరంగేట్రానికి సిద్ధమైపోయాడు. ఇక తొలి వన్డేలో శిఖర్ ధావన్, రాహుల్ ఫామ్‌లోకి రావడం టీమిండియాలో మరింత జోష్‌ను నింపింది. ఫస్ట్‌ మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చిన స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌ జట్టులోకి వస్తాడని అంచనా.

అటు కీలకమైన రెండో వన్డేకు ముందు ఇంగ్లాండ్‌కు పెద్ద షాక్‌ తగిలింది. ఆ జట్టు సారథి ఇయాన్‌ మోర్గాన్‌ చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు. అతడి స్థానంలో జోస్‌ బట్లర్‌ ఇంగ్లాండ్‌కు సారథ్యం వహిస్తాడు. మరో ఆటగాడు సామ్‌ బిల్లింగ్స్‌ రెండో వన్డేకు అందుబాటులో ఉండడని ఈసీబీ తెలిపింది. తొలివన్డేలో మోర్గాన్‌ చేతికి గాయమైంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story