India vs Australia 2nd Test : రెండో టెస్టు మనదే!

India vs Australia  2nd Test : రెండో టెస్టు మనదే!
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లను కోల్పోయి 15.5 ఓవర్లలోనే ఛేదించింది.

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా రెండు వికెట్లను కోల్పోయి 15.5 ఓవర్లలోనే ఛేదించింది. మయాంక్ అగర్వాల్‌(5), పుజారా(3) ఫెయిలైనా గిల్(35), రహానే(27) రాణించారు. మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ ఫలితంతో 4 టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు సిడ్నీ లేదా మెల్ బోర్న్ లోనే జనవరి ఏడూ నుంచి జనవరి 11 మధ్య జరగనుంది.

అంతకుముందు 133/6 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన ఆసీస్‌ మరో 67 పరుగులు సాధించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. గ్రీన్(45), కమిన్స్ (22), స్టార్క్ (14) పోరాటం వల్ల ఆ మాత్రం స్కోరైనా చేసింది. గ్రీన్, కమిన్స్ వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 156 పరుగుల వద్ద బుమ్రా ఓ చక్కటి బంతితో ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత వచ్చిన బాట్స్ మెన్స్ లపెద్దగా రాణించకపోవడంతో ఆసీస్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది

Tags

Read MoreRead Less
Next Story