Jasprit Bumrah: రికార్డులు బద్దలు కొట్టిన బుమ్రా

Jasprit Bumrah: రికార్డులు బద్దలు కొట్టిన బుమ్రా
110 ఏళ్లలో ఒకే ఒక్కడు

విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ పై చేయి సాధించింది. యశస్వి జైశ్వాల్ డబుల్ సెంచరీ చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసిన టీమిండియా.. బుమ్రా ఆరు వికెట్లతో చెలరేగడంతో ప్రత్యర్థిని 253 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ 13 పరుగులతో, యశస్వి జైశ్వాల్ 15 పరుగులతో క్రీజ్‌లో ఉండగా.. భారత్ ఆధిక్యం 171 పరుగులకు చేరింది.

భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా ఆరు వికెట్ల‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ వెన్నువిరిచిన విషయం తెలిసిందే. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేస్‌మన్‌గా నిలిచాడు.

మొత్తం 6,781 బంతులు వేసి, 150 వికెట్లు తీశాడు బుమ్రా. అతి తక్కువ బంతుల్లో 150 వికెట్లు తీసిన భారత బౌలర్లలో బుమ్రా తర్వాత వరుసగా ఉమేశ్ యాదవ్ (7661), మహ్మద్‌ షమీ (7755), కపిల్ దేవ్ (8378), రవిచంద్రన్‌ అశ్విన్ (8380) ఉన్నారు. మ్యాచుల పరంగా చూస్తే.. బుమ్రా 34 టెస్ట్ మ్యాచ్‌లలో 150 వికెట్లు పూర్తి చేశాడు.

అత్యంత వేగంగా 150 టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లు (మ్యాచుల పరంగా)

రవిచంద్రన్ అశ్విన్ – 29 మ్యాచ్‌లు,

రవీంద్ర జడేజా – 32 మ్యాచ్‌లు

ఎరపల్లి ప్రసన్న – 34 మ్యాచ్‌లు

అనిల్ కుంబ్లే – 34 మ్యాచ్‌లు

జస్ప్రీత్ బుమ్రా – 34 మ్యాచ్‌లు

హర్భజన్ సింగ్ – 35 మ్యాచ్‌లు

బీఎస్ చంద్రశేఖర్ – 36 మ్యాచ్‌లు

టెస్టుల్లో 150కిపైగా వికెట్లు పడగొట్టిన బౌలర్లలో బుమ్రాది సెకండ్ బెస్ట్ యావరేజ్ కావడం విశేషం. సైడ్ బర్నెస్ యావరేజ్ 16.43 ఉండగా.. బుమ్రా సగటు 20.28గా ఉంది. గత వందేళ్లలో టెస్టుల్లో అత్యుత్తమ యావరేజ్ నమోదు చేసిన బౌలర్‌గా బుమ్రా రికార్డ్ క్రియేట్ చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story