Kohli: ఫామ్ కోల్పోయిన కోహ్లీ..కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..!

Kohli: ఫామ్ కోల్పోయిన కోహ్లీ..కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..!
Kohli: విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. T20 నుంచి తప్పించాలంటూ కపిల్ దేవ్ సూచించాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అన్ని ఫార్మాట్లలో పేలవ ఫామ్ కనబరుస్తూ తన అభిమానుల్ని నిరాశ పరుస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తిరిగి ఫామ్ లోకి రావాలని ఆశిస్తున్న కోహ్లీ ఇవాళ ఇంగ్లండ్‎తో జరిగే రెండో మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్‎లో రాణించకపోతే టీ20 జట్టులో కూడా కొహ్లీ స్థానం కోల్పోయే అవకాశం ఉంది. దీంతో దాదాపు ఐదు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతున్న కొహ్లీ పై అందరి దృష్టి పడింది.

టీ 20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ వదులుకున్న కొహ్లీ.. ఆ తర్వాత ఐపీఎల్ లో బరిలోకి దిగినప్పటికీ.. అక్కడ కూడా నిలకడ లేని ఫామ్‎తో నిరాశ పరిచాడు. విరాట్ వన్డే కెప్టెన్సీ వదులుకోవడంతో.. టెస్టు కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. విరాట్ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ఆటగాళ్లు సైతం కోహ్లీకి విశ్రాంతినివ్వాలని లేదా జట్టు నుంచి తప్పించాలని సూచిస్తున్నారు. ఈక్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్‌ల్లో 450 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌ను పక్కన పెట్టినప్పుడు ఎంతో కాలంగా విఫలమవుతోన్న విరాట్ ను టీ20ల్లో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ ప్రశ్నించాడు.

Tags

Read MoreRead Less
Next Story