హార్థిక్ పాండ్యా ఇంట విషాదం..

హార్థిక్ పాండ్యా ఇంట విషాదం..
పాండ్య సోదరుల తండ్రి హిమాన్షు శనివారం ఉదయం మరణించారు హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు క్రునాల్ ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఎదిగేందుకు, తమ కెరీర్‌కు మద్దతు ఇవ్వడంలో తల్లిదండ్రుల సహకారం గురించి హార్దిక్, క్రునాల్ తరచుగా మాట్లాడుతుండేవారు. హిమాన్షు సూరత్‌లో ఒక చిన్న కార్ ఫైనాన్స్ వ్యాపారాన్ని నడుపుతుండేవాడు. కానీ తన ఇద్దరు కుమారులను మంచి క్రికెటర్లను చేయాలని కలలు కన్నాడు. అందుకోసం అతడు తాను చేసే కార్ ఫైనాన్స్ వ్యాపారాన్ని వదిలి వడోదరకు వెళ్లి తన కొడుకులకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పించాడు.

హర్దిక్, క్రునాల్ ఇద్దరినీ వడోదరలోని మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్ యొక్క క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తయిన తరువాత హార్దిక్ పాండ్యా గత నెలలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. అయితే భారత ఆల్ రౌండర్ టెస్ట్ సిరీస్ కోసం హార్థిక్‌ను ఎంపిక చేయలేదు. అతడు గతంలో వెన్నునొప్పికి గురయ్యాడు. అది సీనియర్ జాతీయ జట్టుపై ప్రభావం చూపింది.



ఇంతలో, వడోదరాలో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2021 ప్రచారంలో క్రునాల్ పాండ్యా బరోడాకు నాయకత్వం వహించారు. ఆల్ రౌండ్ ప్రదర్శనలతో (2 ఇన్నింగ్స్ నుండి 4 వికెట్లు మరియు 77 పరుగులు), క్రునాల్ బరోడాను ఎలైట్ సి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు.

ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నాహాలు ప్రారంభించినందున హార్దిక్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని ఆడేందుకు సుముఖత చూపలేదు. విరామ సమయంలో, హార్దిక్ తన భార్య నటాసా స్టాంకోవిక్, కుమారుడు అగస్త్యతో గడిపేందుకు ఇష్టపడ్డాడు.

2020 ఆగస్టులో హార్దిక్, నటాసాలకు బాబు పుట్టాడు. వాస్తవానికి, ఆగస్టులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు బయలుదేరినందున బాబుతో గడపడానికి తనకు అవకాశం లేకుండా పోయిందని హార్దిక్ చెప్పాడు. ఆ తరువాత యుఎఇ నుండి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.

Tags

Read MoreRead Less
Next Story