CRICKET: భారత జట్టు ఎంపికపై విమర్శలు చేసిన సునీల్ గవాస్కర్

CRICKET: భారత జట్టు ఎంపికపై విమర్శలు చేసిన సునీల్ గవాస్కర్
వెస్టిండీస్ పర్యటనకు ఎంపికైన జట్టుపై పెదవి విరిచిన సునీల్ గవాస్కర్

వెస్టిండీస్ పర్యటనకు ఎంపికైన టీం ఇండియా జట్ల ఎంపికలపై లెజెండరీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ పెదవి విరిచాడు. సెలెక్టర్ల నిర్ణయాలను తప్పుబట్టాడు. సెలక్టర్లు తమ నిర్ణయాలతో ఆటగాళ్లకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో అర్థం కావడంలేదన్నారు. కేవలం IPL ప్రదర్శన ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేయడం సరికాదన్నారు.

శుక్రవారం విండీస్‌ పర్యటనకు వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. జులై 12 న మొదటి టెస్ట్ ప్రారంభమవనుంది.

టెస్ట్ జట్టు ఎంపికపై మాట్లాడుతూ టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారాను తప్పించి అతడిని బలిపశువు చేశారన్నాడు. టీం వైఫల్యానికి అతడు ఒక్కడే కారణం ఎలా అవుతాడని ప్రశ్నించాడు.

"WTC ఫైనల్లో భారత బ్యాట్స్‌మెన్ వైఫల్యానికి పుజారాని ఎందుకు బలి చేశారు. భారత జట్టుకు నిజాయితీ చాలా కాలం నుంచి సేవలందిస్తున్నాడు. అతడిని తొలగిస్తే సోషల్ మీడియాలో ప్రశ్నించే అభిమానులు, ఫాలోవర్లు తక్కువగా ఉన్నందువల్లే పుజారాని తొలగించారా" అని ప్రశ్నించాడు.




దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తోన్న సర్ఫరాజ్‌ని ఎంపిక చేయకపోవడంపై కూడా విమర్శనాస్త్రాలు సంధించాడు.

"గత 3 సీజన్లలో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సగటుతో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌కి జట్టులో స్థానం పొందాలంటే ఏం చేయాలో చెప్పండి. తుది జట్టులో కాకపోయినా, స్క్వాడ్‌లో అయినా అతన్ని చేర్చాల్సింది" అని సర్ఫరాజ్‌కి మద్దతు తెలిపాడు.

భారత యువ ఆటగాళ్లు శుభ్ మన్ గిల్, అక్సర్ పటేళ్లకు భవిష్యత్తులో జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉందని గవాస్కర్ జోస్యం చెప్పాడు. భవిష్యత్ టోర్నమెంట్లలో వీరి పేర్లను పరిగణలోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు.

జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటే ఇషాన్‌ కిషన్‌ కూడా కెప్టెన్సీకి గట్టి పోటీదారుడేనన్నాడు.

"ఫ్యూచర్ కెప్టెన్లుగా శుభ్‌మన్‌ గిల్‌, అక్సర్‌ పటేల్‌ పేర్లను పరిశీలించవచ్చు. అక్సర్ ప్రతీ మ్యాచ్‌తో రాటుదేలుతున్నాడు. వారికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి వారిని ఆలోచించగలిగేలా చేయాలి" అని సెలెక్టర్లకు హితవు పలికాడు.

Tags

Read MoreRead Less
Next Story