CSK Vs LSG IPL 2024 : చెన్నైని చిత్తుచేసిన లక్నో ‘సూపర్‌’ జెయింట్స్‌

CSK Vs LSG IPL 2024 : చెన్నైని చిత్తుచేసిన  లక్నో ‘సూపర్‌’ జెయింట్స్‌
రాహుల్‌, డికాక్‌ రికార్డు భాగస్వామ్యం

వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత లక్నో సూపర్‌ జెయింట్స్‌ మళ్లీ విజయాల బాట పట్టింది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగులు ఛేదనను మరో ఓవర్‌ మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. నిర్జీవమైన లక్నో పిచ్‌పై డికాక్‌ (43 బంతుల్లో 54, 5 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్‌ (53 బంతుల్లో 82, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రికార్డు భాగస్వామ్యంతో ఆ జట్టు 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తిచేసింది. తొలుత సీఎస్‌కేను లక్నో బౌలర్లు కట్టడి చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్‌, 5 ఫోర్లు, 1 సిక్సర్‌), రహానే (36)రాణించారు. రాహుల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

ఫస్ట్ ఇన్నింగ్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ పవర్ ప్లేలోనే 2వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర డకౌట్ కాగా..రుత్ రాజ్ గైక్వాడ్ 17 పరుగులే వెనుతిరిగాడు.33 కే 2 వికెట్లు కోల్పోవడంతో మిగతా బ్యాటర్లపై ఒత్తిడి నెలకొంది.

చెన్నై బ్యాటర్లలో జడేజా ఒక్కటే చివరి వరకు క్రీజులో ఉన్నాడు. 40 బాల్స్ లో 57 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఇక, ఫీల్డింగ్ లోనూ కెప్టెన్ రాహుల్ క్యాచ్... సింగిల్ హ్యాండ్ తో పట్టి వావ్ అనిపించాడు. beఅదరగొట్టాడు.

ధోనిని బెస్ట్ ఫినిషర్ అని ఎందుకు అంటారో ఈరోజు మరోసారి రుజువైంది. 9 బాల్స్ లో 2 సిక్సులు, 3 ఫోర్లు మొత్తంగా 28 పరుగులు కొట్టాడు. 360 డిగ్రీలు తిరిగి ధోని కొట్టిన సిక్స్ ఐతే మొత్తం మ్యాచ్ కే హైలైట్ అని చెప్పుకోవచ్చు.

ఇక ఈ మ్యాచ్ రిజల్ట్ తో.. ఆడిన 7 మ్యాచుల్లో 3వ ఓటమి ముటగట్టుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 7 మ్యాచుల్లో 4వ విజయాన్ని సాధించింది.

Tags

Read MoreRead Less
Next Story