క్రికెట్

Ross Taylor : క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన రాస్ టేలర్..!

Ross Taylor : న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ ఆటగాడిలో ఒకరైన రాస్ టేలర్.. అంతర్జాతీయ క్రికెట్‌‌కి వీడ్కోలు పలికాడు..

Ross Taylor : క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన రాస్ టేలర్..!
X

Ross Taylor : న్యూజిలాండ్ తరఫున ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ ఆటగాడిలో ఒకరైన రాస్ టేలర్.. అంతర్జాతీయ క్రికెట్‌‌కి వీడ్కోలు పలికాడు.. ఈ మేరకు గురువారం ట్విట్టర్‌లో ప్రకటించాడు. త్వరలో స్వదేశంలో జరగబోయే బంగ్లాదేశ్‌తో 2 టెస్టులు, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో 6 వన్డేలు అనంతరం క్రికెట్ నుంచి తప్పుకుంటానని టేలర్ తెలిపాడు. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది గర్వకారణంగా ఉందని, ఇదో అద్భుతమైన ప్రయాణమని అన్నాడు. గత 17 ఏళ్లుగా సపోర్ట్ చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు టేలర్.. కాగా 2006లో మెక్లీన్ పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌‌తో క్రికెట్ అరంగేట్రం చేశాడు టేలర్.. ఆ తర్వాత 2007లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. టేలర్ మొత్తం అన్ని ఫార్మాట్లలో, టేలర్ న్యూజిలాండ్ తరపున 445 మ్యాచ్‌లు ఆడిన 18,074 పరుగులు చేశాడు.

Next Story

RELATED STORIES