పీటర్‌సన్‌ ట్వీట్‌ : స్పందించిన మోదీ!

పీటర్‌సన్‌ ట్వీట్‌ : స్పందించిన మోదీ!
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారతదేశం పట్ల చూపించిన అభిమానాన్ని చూసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంతోషించారు.

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారతదేశం పట్ల చూపించిన అభిమానాన్ని చూసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంతోషించారు. భారత్ పలు దేశాలకు కోవిడ్‌-19 టీకాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఫిబ్రవరి 1న భారత్‌ కరోనా వ్యాక్సిన్‌ను దక్షిణాఫ్రికాకు పంపించింది.

దక్షిణాఫ్రికాలో మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లతో ల్యాండ్ అయిన విమానంతో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. దీనిపైన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్‌సన్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'భారతదేశం రోజురోజుకు చాలా దయ, ఉదారభావం పెంపొందించుకుంటూ ప్రపంచ దేశాలకు కష్టకాలంలో సాయం అందిస్తోంది' అని ట్వీట్ చేశాడు.

అయితే పీటర్‌సన్‌ ట్వీట్ పైన నరేంద్ర మోడీ స్పందించారు. "భారతదేశం పట్ల మీకున్న ప్రేమ, అభిమానాన్ని చూడటం ఆనందంగా ఉంది.. ప్రపంచం మొత్తం ఒక కుటుంబమని తాము ఎల్లప్పుడూ బలంగా నమ్ముతాం. కరోనా మహామ్మరిపై పోరాటం చేయటంలో తమ దేశం శక్తిని కూడదీసుకొని కీలక పాత్ర పోషిస్తోంది' అని మోడీ ట్వీట్ చేశారు.

కాగా పీటర్సన్ దక్షిణాఫ్రికాలో జన్మించి తర్వాత ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ తరపున ఆటగాడిగా, కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించాడు.


Tags

Read MoreRead Less
Next Story