క్రికెట్

T20 World Cup: కంగ్రాట్స్ న్యూజిలాండ్.. బైబై టీమిండియా..

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా విజయంపై టీమ్ ఎప్పుడో నీళ్లు చల్లేసింది.

T20 World Cup (tv5news.in)
X

T20 World Cup (tv5news.in)

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా విజయంపై టీమ్ ఎప్పుడో నీళ్లు చల్లేసింది. కానీ మొన్న ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాప్ ప్లేయర్స్ అందరూ మళ్లీ ఫార్మ్‌లోకి రావడంతో ఎక్కడో చిన్న ఆశ టీమిండియా అభిమానుల్లో చిగురించింది. మళ్లీ ఈరోజు ఆ కలలు నెరవేరవని తేలిపోయింది. ఈరోజు టీ20 వరల్డ్ కప్‌లో ఆఫ్గనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్ గెలిస్తేనే టీమిండియా సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ లాంటి స్ట్రాంగ్ టీమ్ ముందు ఆఫ్గనిస్తాన్ గెలవదని తెలిసినా.. ఎక్కడో టీమిండియా ఫ్యాన్స్‌కు ఒక్క అద్భుతం జరగకపోదా అన్న ఆశలు ఉన్నాయి. కానీ ఏ అద్భుతం టీమిండియాను కాపాడలేకపోయింది. చాలామంది ఊహించినట్టుగానే న్యూజిలాండ్ చేతిలో ఆఫ్గనిస్తాన్ ఓడిపోయింది. దీంతో సెమీస్‌కు ఇండియా వెళ్లే ఛాన్స్‌ను మిస్ అయ్యింది.

టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఇంకొక మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ అది టీమ్ ఫ్యూచర్‌ను ఏ మాత్రం డిసైడ్ చేసేది కాదు. నమీబియాతో మ్యాచ్ ఇంకా మిగిలున్నా అది సెమీస్‌పై ఏ మాత్రం ప్రభావం చూపించదు. అందుకే ఇండియన్ క్రికెట్ లవర్స్ అంతా ఇప్పటికే మ్యాచ్ విషయాన్ని పక్కన పెట్టి టీ20 వరల్డ్ కప్ గురించి పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిసారి పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకున్నందుకు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES