క్రికెట్

Virat Kohli : వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ..!

Virat Kohli : మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. దేశ ప్రజలందరూ వీలైనంత తొందరగా టీకా వేయించుకోవాలని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశాడు.

Virat Kohli : వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ..!
X

Virat Kohli : మిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. దేశ ప్రజలందరూ వీలైనంత తొందరగా టీకా వేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో ముంబైలోని తన ఇంటికి చేరిన కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కూతురుతో ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ సమయంలో బీసీసీఐ సూచన మేరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. కాగా కోహ్లీ దంపతులు కోవిడ్ సహాయక చర్యల కోసం నిధుల సేకరణ నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. స్వయంగా ఈ ప్రచారానికి గాను రూ .2 కోట్లు విరాళంగా ఇచ్చారు. మొత్తం ఏడు కోట్ల రూపాయలను లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు పేసర్ ఇషాంత్ శర్మ, అతని భార్య ప్రతిమ సింగ్ ఇవాళే ఫస్ట్ డోసు తీసుకున్నారు. గత వారం అజింక్యా రహానె, శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్ వ్యాక్సిన్ వేయించుకున్న సంగతి తెలిసిందే.!

Next Story

RELATED STORIES