స్కూల్స్‌పై కరోనా దెబ్బ.. కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య

స్కూల్స్‌పై కరోనా దెబ్బ.. కరస్పాండెంట్ దంపతుల ఆత్మహత్య
కరోనా దెబ్బకు ప్రైవేట్ పాఠశాలల టీచర్లు వీధిన పడ్డారు. అప్పో సప్పో తెచ్చి ప్రయివేట్ స్కూలు ఏర్పాటు చేసిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

దేశంలో ఇంకా కరోనా కేసులు కనబడుతూనే ఉన్నా కార్యాలయాలు, వ్యాపార సంస్థలు పని చేస్తూనే ఉన్నాయి. కానీ స్కూళ్లు, కాలేజీలు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. కరోనా దెబ్బకు ప్రైవేట్ పాఠశాలల టీచర్లు వీధిన పడ్డారు. అప్పో సప్పో తెచ్చి ప్రయివేట్ స్కూలు ఏర్పాటు చేసిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇంకా బడి తెరుచుకోకపోవడంతో టీచర్లకు జీతాలు ఇవ్వలేక, భవనాల అద్దెలు చెల్లించలేక స్కూల్స్ యాజమాన్యం చాలా ఇబ్బందులు ఎదుర్కుంటోంది. స్కూల్ నిర్వహణం కోసం చేసిన అప్పులు తీర్చలేక కర్నూలుకు చెందిన దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో నివసిస్తున్న దంపతులు సుబ్రహ్మణ్యం, రోహిణి దంపతులు లైఫ్ ఎనర్జీ స్కూల్ నడుపుతున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల వద్ద సుమారు రెండున్నర కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. తీసుకున్న అప్పు తిరిగి తీర్చే మార్గం లేక దంపతులిద్దరూ మానసిక వేదనకు గురయ్యారు. అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి అధికమవడంతో ఆత్మహత్య చేసుకున్నారు.

ఆదివారం ఆత్మకూరులో ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భార్యాభర్తలిద్దరు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. తమ చావుకు అప్పులిచ్చిన వారే కాణమని.. వారి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని దంపతులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story