అతనికి 21, ఆమెకి 45.. నాలుగో పెళ్ళికి రెడీ.. నిలదీసిన ఐదుగురు కూతుళ్లు.. చివరికి ఇంకో ట్విస్ట్..!

అతనికి 21, ఆమెకి 45 సంవత్సరాలు.. ఒకరి తర్వాత మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఆమెకి ఐదుగురు కూతుళ్ళు కూడా ఉన్నారు.

అతనికి 21, ఆమెకి 45.. నాలుగో పెళ్ళికి రెడీ.. నిలదీసిన ఐదుగురు కూతుళ్లు.. చివరికి ఇంకో ట్విస్ట్..!
X

అతనికి 21, ఆమెకి 45 సంవత్సరాలు.. ఒకరి తర్వాత మరొకరిని ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. ఆమెకి ఐదుగురు కూతుళ్ళు కూడా ఉన్నారు. ఇందులో 21 ఏళ్ల పెద్ద కూతురికి వివాహం కూడా జరిగింది. మిగిలిన నలుగురి కూతుళ్ళ బాధ్యత అమె పైన ఉంది. కానీ ఆమె తన బాధ్యతను మరిచి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి సిద్దమైంది. దీనితో మిగిలిన ఆ నలుగురు కూతుళ్ళు పోలీసులను ఆశ్రయించడంతో వీరి కథ పొలీస్ స్టేషన్ కి చేరింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ మొహల్లా ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వయసున్న మహిళకు ఐదుగురు కూతుళ్లున్నారు. మొదటగా ఆమెకి 15 ఏళ్ల వయసులో వివాహమైంది. విభేధాల వలన రెండేళ్ళలో భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో రెండో భర్త కూడా మరణించడంతో కొన్ని రోజులు ఒంటరిగానే ఉండి.. ఆ తరవాత మూడో పెళ్లి చేసుకుంది. మూడో భర్తతో ఉంటూనే 21 ఏళ్ల కుర్రాడు మిథున్‌తో ప్రేమాయణం నడిపించింది.

ఈ క్రమంలో అనారోగ్యం కారణంగా ఆమె మూడో భర్త అనారోగ్యంతో మరణించాడు. దీనితో ఎవరీ అడ్డు లేదనుకున్నా ఆమె.. ప్రియుడితో కలిసి అడ్డు అదుపు లేకుండా చట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలు పెట్టింది. ఈ విషయం ఊళ్లో తెలిసి నలుగురూ నానా రకాలుగా మాట్లాడుకుంటుండటంతో వారి కూతుళ్లు దీన్ని అవమానంగా భావించారు. ఇదే విషయం పైన ఆమెను నిలదీస్తే.. వారిని కూడా ఇంట్లోంచి వెళ్లగొట్టింది. దీనితో వారు పోలీసులను ఆశ్రయించారు.

అయితే పొలీస్ స్టేషన్ లో ఆమె ప్రవర్తనని చూసి పోలీసులు ఖంగుతిన్నారు. "మేం మేజర్లం. మాకిష్టం వచ్చినట్టు బతుకుతాం. మీకేంటి నష్టం" అంటూ ఆమె తన కూతుళ్ళతో పోలీస్ స్టేషన్లోనే వాదులాట పెట్టుకుంది. దీనికి తోడు ఆమె ప్రియుడు కూడా నేను తనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. త్వరలోనే ఆమెను నా భార్యగా చేసుకుంటా. ఆమె కూతుళ్లను నా కూతుళ్లుగా చూసుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. ఇది పోలీసులను మరింత షాక్‌‌కి గురి చేసింది.

అనంతరం ఇద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వగా మిథున్ లో మార్పు వచ్చింది. ఆమెను నేను ఎప్పటికి కలవను అంటూ చెప్పేశాడు. కానీ ఆ మహిళ మాత్రం తానూ మిథున్‌ను వదులుకోలేను అంటూ చెప్పడం గమనార్హం.

Next Story

RELATED STORIES