చిన్నారితో 50 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన..నగ్నంగా ఊరేగించిన స్థానికులు

చిన్నారితో 50 ఏళ్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన..నగ్నంగా ఊరేగించిన స్థానికులు
X

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఓ వ్యక్తిని స్థానికులు చితక్కొట్టారు. 3 ఏళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించడమే దీనికి కారణం. జంగారెడ్డిగూడెం నుంచి బంధువుల ఇంటికి వచ్చిన 50 ఏళ్ల వ్యక్తి.. సాయంత్రం సమయంలో ఇంటిబయట ఆడుకుంటున్న 3 ఏళ్ల పాప పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. ఆ చిన్నారి కేకలు పెట్టింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని పట్టుకుని దాడి చేశారు. చెట్టుకు కట్టేసి కొట్టారు. తర్వాత నగ్నంగా రోడ్లపై ఊరేగించారు. ఇంతలో ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES