రూ.7 కోట్ల బంగారు ఆభరణాలతో డ్రైవర్‌ పరార్

రూ.7 కోట్ల బంగారు ఆభరణాలతో డ్రైవర్‌ పరార్
రెండు నెలల క్రితం బంగారు వ్యాపారి రాధిక వద్ద రాజమండ్రికి చెందిన శ్రీనివాస్‌ డ్రైవర్‌గా చేరాడు

హైదరాబాద్‌ ఎస్సార్‌ నగర్‌లో భారీ చోరీ జరిగింది. 7 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో.. ఓ డ్రైవర్‌ పరారయ్యాడు. ఆభరణాలతో డ్రైవర్‌ ఉడాయించడంతో.. బంగారం వ్యాపారి ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు డ్రైవర్‌ కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రెండు నెలల క్రితం బంగారు వ్యాపారి రాధిక వద్ద రాజమండ్రికి చెందిన శ్రీనివాస్‌ డ్రైవర్‌గా చేరాడు. బంగారు నగలతో కారులో విజయవాడ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం 7 కోట్లకు పైగా నగలను కస్టమర్లకు డెలివరీ ఇవ్వడానికి సేల్స్ మెన్ అక్షయ్, డ్రైవర్ శ్రీనివాస్ పంపారు. ఇద్దరు కారులో బయలు దేరారు. మధురానగర్ లో ఓ కస్టమర్ కు 50 లక్షల విలువైన నగలను డెలివరీ ఇచ్చాడు అక్షయ్. బయటకు వచ్చి చూడగా డ్రైవర్ శ్రీనివాస్ కారుతో సహా కనిపించలేదు. అప్పటికే సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జువెల్లర్స్ కు ఇవ్వాల్సిన రూ.7 కోట్ల రూపాయల ఆభరణాలు కారులోనే ఉన్నాయి. దీంతో వెంటనే రాధికకు పరిస్థితిని తెలియజేశాడు అక్షయ్. వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story