తీసుకున్న అప్పు ఇచ్చేయంటే మహిళను కాలితో తన్నేశాడు..!

ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వామని అడిగినందుకు మహిళను కాలితో తన్నాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది.

తీసుకున్న అప్పు ఇచ్చేయంటే మహిళను కాలితో తన్నేశాడు..!
X

ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళను కాలితో తన్నాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. మహిళను కాలితో తన్నడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ప్రస్తుతం మంగళగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చిర్రావూరుకు చెందిన గోపీకృష్ణ అనే యువకుడికి గోవర్ధని అనే మహిళ గతంలో వడ్డీకి రూ.3లక్షలు అప్పు ఇప్పించింది.

డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే ఎదో వంక చెప్పి తప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలో గోపీకృష్ణ.. మంగళగిరి మండలం రామచంద్రపురం సమీపంలో ఉన్నాడని తెలుసుకొని అతని ఆటోకి, బైక్ ని అడ్డంగా పెట్టి డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆటోలో కూర్చున్న గోపికృష్ణ ఒక్కసారిగా ఆవేశానికి లోనై గోవర్ధనిని కాలితో తన్నాడు. దీంతో ఆమె నాలుగడుగుల దూరంలో పడిపోయింది.

అనంతరం గోపికృష్ణ పైన పోలీసులకి ఫిర్యాదు చేయగా, అతని పైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.


Next Story

RELATED STORIES