పండుగపూట విషాదం : రాఖీ కట్టిన రోజే మృతి....!

రాఖీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. విజయవాడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉషా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

పండుగపూట విషాదం : రాఖీ కట్టిన రోజే మృతి....!
X

రాఖీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. విజయవాడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఉషా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిన్న రాఖీ పండగ కావడంతో సోదరుడు సూర్యనారాయణ ఇంటికి వెళ్లి రాఖీ కట్టింది. అనంతరం తన ఇంటికి వెళ్లిన ఉషా.. రెండు గంటల తర్వాత చనిపోయిందని సోదరుడికి సమాచారం అందింది. అత్తింటి వారే ఉషా మరణానికి కారణమని బంధువుల ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఫణి అనే వ్యక్తిని ఉషా ప్రేమ వివాహం చేసుకుంది.

Next Story

RELATED STORIES