విషాదం : మృతి చెందిన అన్నకి రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు

వారంతా సోదరుడికి రాఖీ కట్టడానికి నిన్న సాయంత్రమే ఇంటికి చేరుకున్నారు. తెల్లవారితే అన్నకు రాఖీ కడదామని ముచ్చటపడ్డారు.

విషాదం : మృతి చెందిన అన్నకి రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు
X

వారంతా సోదరుడికి రాఖీ కట్టడానికి నిన్న సాయంత్రమే ఇంటికి చేరుకున్నారు. తెల్లవారితే అన్నకు రాఖీ కడదామని ముచ్చటపడ్డారు. కానీ తాము ఒకటి తలిస్తే... దైవం మరొకటి తలచింది. ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం కారణంగా అన్న మరణించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. నల్గొండ జిల్లా మాలగూడెంలో ఉంటున్న చింతపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తికి ఐదుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. అయితే లక్ష్మయ్యకు రాఖీ కట్టడానికి వారంతా వచ్చారు. ఉదయాన్నే రాఖీ కడదామనుకునేసరికే తిరిగిరాని లోకాలు వెళ్లిపోయారు లక్ష్మయ్య. దీంతో అతని మృతదేహానికి రాఖీ కట్టి తుది వీడ్కోలు పలికి సోదర ప్రేమను చాటుకున్నారు. ఈ సంఘటన గ్రామస్తులందరీ కంటతడిపెట్టించింది.

Next Story

RELATED STORIES