క్యాజువల్‌‌గా ఇంటికి ఆహ్వానించి .. ఎంతకి తెగించాడంటే.. !

క్యాజువల్‌‌గా ఇంటికి ఆహ్వానించి యువతికి మత్తుమందు కలిపిన కూల్‌‌‌డ్రింక్‌ ఇచ్చి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రభుద్దుడు.

క్యాజువల్‌‌గా ఇంటికి ఆహ్వానించి .. ఎంతకి తెగించాడంటే.. !
X

క్యాజువల్‌‌గా ఇంటికి ఆహ్వానించి యువతికి మత్తుమందు కలిపిన కూల్‌‌‌డ్రింక్‌ ఇచ్చి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రభుద్దుడు. ఈ ఘటన ఉదయ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన బాధితురాలు స్థానికంగా ఇంజనీరింగ్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోచింగ్‌ సెంటర్‌ను నడుపుతుంది. ఇందులో నీరజ్‌కుమార్‌ అనే వ్యక్తి విద్యార్థులకి కోచింగ్ ఇస్తుంటాడు. దీంతో వీరిద్దరికి కొంత పరిచయం ఏర్పడింది. అయితే గత కొంతకాలంగా యజమానిపై కన్నేసిన నీరజ్.. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే ఓ ప్లాన్ వేశాడు.

ఆ యువతిని ఉదయ్‌పూర్‌లోని తన ఇంటికి రావల్సిందిగా ఆహ్వానించాడు. అయితే తెలిసిన వ్యక్తి కదా అని ఆమె కూడా అతన్ని నమ్మి వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌‌‌డ్రింక్‌ ఇవ్వడంతో ఆమె మెల్లిగా మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు నీరజ్‌. కాసేపటికి మత్తు నుంచి తేరుకున్నాక సదరు యువతికి విషయం అర్ధం కావడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించింది. నీరజ్‌ పైన పలు సెక్షన్‌‌ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES