పెళ్లి పేరుతో రూ.11 కోట్లకు టోకరా పెట్టేసింది..!

పెళ్లి పేరుతో రూ.11 కోట్లకు టోకరా పెట్టేసింది..!
హైదరాబాద్‌లో ఐపీఎస్‌గా చలామనీ అవుతూ... ఓ వ్యక్తికి ఏకంగా పదకొండున్నర కోట్లకు టొకారా పెట్టిన నకిలీ ఐపీఎస్‌ స్మృతి సింహను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

హైదరాబాద్‌లో ఐపీఎస్‌గా చలామనీ అవుతూ... ఓ వ్యక్తికి ఏకంగా పదకొండున్నర కోట్లకు టొకారా పెట్టిన నకిలీ ఐపీఎస్‌ స్మృతి సింహను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాచుపల్లికి చెందిన వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి పెళ్లి పేరుతో వసూలకు పాల్పడింది. తనకు కోట్ల రూపాయల ఆస్తులున్నాయని.. తాను ఐపీఎస్‌కి సెలక్ట్‌ అయ్యి డెహ్రాడూన్‌లో ట్రైనింగ్‌ కోసం వెళ్తున్నానని నమ్మించి ఏకంగా పదకొండున్నర కోట్లు తన ఖాతాలో వేయించుకుంది.

ఈ డబ్బుతో తన బంధువు విజయ్‌కుమార్‌తో కలిసి విలాసవంతమైన జీవితం గడిపింది. ఖరీదైన కార్లు, బంగారు నగలు, విలాసవంతమైన విల్లా కూడా కొనుగోలు చేసింది. విరారెడ్డి నుంచి అందినకాడకు దోచుకుంది. ఇంటర్‌నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ సౌత్ ఇండియా విభాగానికి చైర్మన్‌గా చలామనీ అవుతూ నకిలీ పత్రాలు, ఐడీ కార్డు సృష్టించి మోసాలకు పాల్పడింది.


అయితే విజయ్‌కుమార్‌ గత నెలలోనే సూసైడ్‌ చేసుకున్నాడు. అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని భయంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఇక బాధితుడు వీరారెడ్డి ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు... శ్రుతి సిన్హాతో పాటు మరో నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఖరీదైన కార్లు, 6 కోట్ల విలువగల బంగారు నగలు సీజ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story