పసిపాప పై పైశాచికం.. : 6 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య..

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో ఉన్మాది.

పసిపాప పై పైశాచికం.. : 6 ఏళ్ల చిన్నారిని  అత్యాచారం చేసి హత్య..
X

హైదరాబాద్‌ సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో ఉన్మాది. ఈ దుర్మార్గానికి పాల్పడింది చిల్లర దొంగతనాలు చేసే ఆటో డ్రైవర్ రాజుగా గుర్తించారు. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి కనిపించకుండా పోయింది. పాప కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల అన్ని చోట్లా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. కాసేపటికి ఆటో డ్రైవర్‌ రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. తలుపులు పగలగొట్టి చూస్తే లోపల విగతజీవిలా కనిపించిన బాలికను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

నిందితుడు రాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనతో స్థానికులంతా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పోలీసులు అతన్ని పట్టుకుని తమకు అప్పగిస్తే బహిరంగంగానే శిక్షిస్తామంటున్నారు. అభంశుభం తెలియని చిన్నారిపై అత్యంత పాశవికంగా లైంగికదాడి చేసి చంపేసిన వాడిని వదలిపెట్టొద్దని డిమాండ్‌ చేస్తున్నారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ కాలనీవాసులంతా పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. రాత్రంతా జరిగిన ఆందోళనలు.. ఉదయం కూడా కొనసాగాయి.. ఓ దశలో కేసు విచారణకు వచ్చిన పోలీసులతోనూ స్థానికులు వాగ్వాదానికి దిగారు. వియ్‌ వాంట్‌ జస్టిస్‌ అంటూ రోడ్డెక్కి నినాదాలు చేస్తున్నారు.. స్థానికుల ఆందోళనలతో పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి..

ప్రస్తుతం బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తి చేశాక కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.Next Story

RELATED STORIES