ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం

నిర్మల్‌ జిల్లా కడెం మండలం పెత్తార్పు గ్రామంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన..

ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం
X

నిర్మల్‌ జిల్లా కడెం మండలం పెత్తార్పు గ్రామంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పక్కింట్లో ఆడుకోవడానికి వచ్చిన చిన్నారిపై వృద్ధుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే పాప తండ్రి నిర్మాల్‌ వెళ్లాడు. పాప తల్లి కూలీ పనికి వెళ్లింది. ఇంటి వద్ద నానమ్మతో ఉంటోంది. పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లగా... వృద్ధుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పాప కేకలు వేయడంతో వృద్ధుడు వదిలిపెట్టాడు. చిన్నారి పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి నానమ్మకు విషయం తెలిపింది. పాప కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Next Story

RELATED STORIES