Banjara Hills: మెడిసిన్ చదవలేక... ఎయిర్ హోస్టస్ అవ్వలేక.. వ్యభిచార గృహం దిశగా

Banjara Hills: మెడిసిన్ చదవలేక... ఎయిర్ హోస్టస్ అవ్వలేక.. వ్యభిచార గృహం దిశగా
బంజారాహిల్స్ లో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార నిర్వహిస్తున్న స్పా సెంటర్ పై హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ముగ్గురు నిర్వాహకులు, పదిమంది యువతలతో పాటూ 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని ఓ అపార్ట్మెంట్లో ముగ్గురు నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో స్పా సెంటర్ ను ఏర్పాటు చేసిన రాయల శృతి, రమణ, జాహెద్ వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పక్కా ఆధారలు సేకరించారు. ప్రధాన నిందితురాలు శృతి మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ అని తెలుస్తోంది. ఉక్రెయిన్ లో మెడిసిన్ మొదటి సంవత్సరం పూర్తిచేసి, ఆర్ధిక కారణాలవల్ల మధ్యలోనే స్వస్థలమైన భధ్రాచలం తిరిగి వచ్చేసింది. అనంతరం అమీర్ పేటలో ఎయిర్ హోస్టెస్ గా శిక్షణ తీసుకుని, ఓ స్టార్ హోటల్ లో రిసెప్షనిస్ట్ గానూ విధులు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆమె పెడదారి పట్టి వ్యభిచార గృహం నిర్వహించే వైపు అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. పట్టుపడిన యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story