Rajasthan : అందంతో వ్యాపారవేత్తకు వల.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌.. చివరికి

Rajasthan : అందంతో వ్యాపారవేత్తకు వల.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌.. చివరికి
Rajasthan : రాజస్థాన్‌ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలోని తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం దొరికిన మహిళ మృతదేహం కేసును పోలీసులు చేధించారు

Rajasthan : రాజస్థాన్‌ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలోని తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు రోజుల క్రితం దొరికిన మహిళ మృతదేహం కేసును పోలీసులు చేధించారు.. గోనెసంచిలో దొరికిన ఆ మహిళ ఓ ట్యూషన్ టీచర్ అని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులకి విస్తుపోయే విషయాలు తెలిశాయి.. విచారణలో భాగంగా ఆ యువతి పేరు ప్రియాంక(29) గా నిర్ధారించారు.

ఢిల్లీ నుంచి వలస వచ్చిన ఆమె.. అల్వార్‌‌లో ఓ ట్యూషన్ టీచర్‌గా వ్యాపారవేత్త కపిల్ గుప్తా పిల్లలకు ప్రైవేట్‌ పాఠాలు చెప్తుండేది. ఈ క్రమంలో ఆమె అందానికి ఫిదా అయిన కపిల్‌.. అమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఇక్కడి నుంచి అసలు గేమ్ ఆడడం మొదలుపెట్టింది ప్రియాంక.. తనకు పెళ్లి కుదిరిందని, రూ.50 లక్షలు కట్నం అడుగుతున్నారని సదరు వ్యాపారవేత్తపై ఒత్తిడి చేయడం స్టార్ట్ చేసింది.

దీనితో ఈ విషయాన్ని తన భార్య సునైనా గుప్తా, ఆమె సోదరులకి చెప్పిన అతను.. ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు.. డబ్బు కోసం నమ్మి గుడ్డిగా వచ్చిన ప్రియాంక‌‌ని చంపేసి ఓ గోనె సంచిలో కుక్కి తాతర్‌పూర్‌ బ్రిడ్జి కింద పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గత నాలుగు రోజులుగా విచారణ మొదలుపెట్టారు.. ఫైనల్ గా ఈ కేసులో నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే ప్రియాంక ఇలా ట్రాప్ చేసి మోసం చేయడం మొదటిసారి ఏం కాదు.. ఇప్పటివరకు ఇలా ఆమె ఎనిమిది మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ట్యూషన్‌ పేరుతో ఇళ్లలోకి చేరి పిల్లల తండ్రులకి వల వేసి ఆపై బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు గుంజేదని పోలీసుల విచారణలో తేలింది. కానీ చివరికి ఆమె బలైపోయింది.

Tags

Read MoreRead Less
Next Story