30 లక్షలకు పులి చర్మాన్నిబేరానికి పెట్టారు..!

ఏటూరు నాగారం సమీపంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పులిచర్మం అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు... పక్కా ప్లాన్‌ ప్రకారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

30 లక్షలకు పులి చర్మాన్నిబేరానికి పెట్టారు..!
X

పులిచర్మం అమ్ముతున్న అంతర్‌రాష్ట్ర ముఠాను ములుగు పోలీసులు పట్టుకున్నారు. ఏటూరు నాగారం సమీపంలోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పులిచర్మం అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు... పక్కా ప్లాన్‌ ప్రకారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాజేడు మండలానికి చెందిన తిరుమలేష్‌.. చత్తీస్‌గఢ్‌లో ఉండే తన బావ సాగర్‌తో కలిసి ఈ పులిచర్మాన్ని మరో వ్యక్తికి 30 లక్షలకు అమ్మజూశారు. అయితే ఈ సమాచారం బయటకు పొక్కడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా వ్యూహం ప్రకారం... ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

Next Story

RELATED STORIES