పూజల పేరుతో కూతుళ్లిద్దరినీ అమ్మానాన్నలు అన్యాయంగా..

అతీంద్రీయ శక్తులేవో ఆవహించాయన్న మూఢభక్తితో ఎదిగిన కూతుళ్లిద్దరినీ అన్యాయంగా

పూజల పేరుతో కూతుళ్లిద్దరినీ అమ్మానాన్నలు అన్యాయంగా..
X

చదువు, సంస్కారం లేని వాళ్లు చేశారంటే అనుకోవచ్చు. బాగా చదువుకుని విద్యార్థులకు మంచి చెడు బోధించే మాస్టారి వృత్తిలో ఉన్నారు భార్యభర్తలిద్దరూ. అయినా అతీంద్రీయ శక్తులేవో ఆవహించాయన్న మూఢభక్తితో ఎదిగిన కూతుళ్లిద్దరినీ అన్యాయంగా చంపేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనరగ్‌లో ఆదివారం రాత్రి వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివనగర్‌కు చెందిన పురుషోత్తం నాయుడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. భార్య పద్మజ ఓ విద్యాసంస్థకు కరస్పాండెంట్. వీరికి ఇద్దరు కుమార్తెలు.. అలేఖ్య (27), సాయిదివ్య (22) ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తో భోపాల్‌లో పీజీ చేస్తుండగా, చిన్న కుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.

గత ఏడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వెళ్లారు పురుషోత్తం కుంటుంబం. ఇంట్లో తరచుగా పూజలు నిర్వహించే వారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా పూజలు నిర్వహించారు. అందులో భాగంగా చిన్న కుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు.

తర్వాత పెద్ద కుమార్తెను నోటిలో రాగి చెంబు పెట్టి బలంగా డంబెల్‌తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కాలేజీలోని ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న మదనపల్లి డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మూఢభక్తి..

హత్యకు గురైన వారితో పాటు, హంతకులు అందరూ దైవభక్తిలో పూర్తిగా లీనమౌపోయారని డీఎస్పీ తెలిపారు. తమ బిడ్డలు మళ్లీ బతుకుతారని హంతకులు చెబుతున్నారని అన్నారు. తల్లి బిడ్డలను హతమారుస్తుండగా, తండ్రి అక్కడే ఉన్నట్లు విచారణలో తేలింది. వీరిరువురు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్యాభర్తలిరువురు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటారేమోననే అనుమానంతో ఇంటి వద్ద పోలీసుల్ని కాపలా ఉంచారు. బాగా చదువుకున్నవారే ఇలా చేయడం శోచనీయమని, మంత్రతంత్రాలకు అలవాటు పడి అఘాయిత్యం చేశారని ఆయన పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES