మిర్యాలగూడలోని అంకిత నర్సింగ్ హోమ్‌ సీజ్..!

కొవిడ్‌తో ఒకపక్క ప్రజలు అల్లాడుతుంటే.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నాయి.

మిర్యాలగూడలోని అంకిత నర్సింగ్ హోమ్‌ సీజ్..!
X

కొవిడ్‌తో ఒకపక్క ప్రజలు అల్లాడుతుంటే.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నాయి. వైద్యారోగ్య శాఖ నుంచి కనీస అనుమతులు లేకుండానే ఎడాపెడా టెస్టులు నిర్వహిస్తూ ట్రీట్‌మెంట్ పేరిట వేలకు వేలు దండుకుంటున్నాయి. నల్లొండ జిల్లా మిర్యాలగూడలోని అంకిత నర్సింగ్ హోమ్‌పై టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అనుమతులు లేకుండా కొవిడ్ టెస్టులు జరుపుతున్న సిద్దార్థ డయాగ్నస్టిక్ సెంటర్‌ను సైతం సీజ్ చేశారు. డాక్టర్ మధుసూదన్ రెడ్డి సహా ల్యాబ్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని వన్ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.

Next Story

RELATED STORIES