ఏపీ ఫారెస్ట్ అధికారి రమణమూర్తి బలవన్మరణం.. గోప్యంగా ఉంచిన పోలీసులు

X
Nagesh Swarna1 Oct 2020 1:34 PM GMT
ఏపీ ఆటవీశాఖ అధికారి వి.బి.రమణమూర్తి.. హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నాగోల్‌లోని రాజీవ్ గృహకల్ప ఐదో అంతస్తు నుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కుమార్తె నివాసానికి వెళ్లిన రమణమూర్తి.. రాత్రి 2 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని శవపరీక్ష కోసం మార్చురికీ తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణలో ఒత్తిడి వల్లే చనిపోయారని... ఆయన భార్య ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో చిన్నచిన్న సమస్యలే తప్ప ఆత్మహత్యచేసుకునే అంత పెద్ద కారణాలు లేవని.. రమణమూర్తి మిత్రుడు రాజు అంటున్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరులోని అరణ్యభవన్‌లో పీసీసీఎఫ్‌గా పనిచేస్తున్నారని తెలిపారు.
Next Story