ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ.. ఉద్యోగులను కట్టేసి బంగారం చోరీ

ఆఫీసులో నలుగురు ఉద్యోగులే ఉండడంతో తుపాకీతో బెదిరించి వారిని కట్టేసి బంగారు ఆబరణాలు దోచుకెళ్లారు.

ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరీ.. ఉద్యోగులను కట్టేసి బంగారం చోరీ
X

చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతం బాగాళూరు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. సుమారు 7 కోట్ల రూపాయల విలువ చేసే 25 కిలోల బంగారం, 90 వేల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు.. ఉదయం ఆఫీసులో నలుగురు ఉద్యోగులే ఉండడంతో తుపాకీతో బెదిరించి వారిని కట్టేసి బంగారు ఆబరణాలు దోచుకెళ్లారు.

మొదట కస్టమర్లలా ప్రవేశించిన దుండగులు.. లోపల కేవలం తక్కువ మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని గుర్తించి చోరీకి పాల్పడ్డారు. దొంగలు అక్కడి నుంచి పరారైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు సిబ్బంది.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Next Story

RELATED STORIES