ఆర్మీ ఉద్యోగి బాలికకు మాయమాటలు చెప్పి తోటల్లోకి తీసుకెళ్లి..

ఆర్మీ ఉద్యోగి బాలికకు మాయమాటలు చెప్పి  తోటల్లోకి తీసుకెళ్లి..
X

విజయనగరం జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపింది. దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మరడాం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి సాయికుమార్.. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను స్నేహం పేరుతో మాయమాటలు చెప్పి.. లోబర్చుకున్నాడు. బాలికను తోటల్లోకి తీసుకెళ్లి, తన స్నేహితుడు నాగేంద్రకుమార్‌తో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికతో నాగేంద్ర అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో అత్యాచారానికి పాల్పడిన సాయికుమార్‌తోపాటు అసభ్యంగాప్రవర్తించిన నాగేంద్రకుమార్‌పై పోలీసులు పోక్సో యాక్ట్, దిశ చట్టం కింద కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పాపారావు వెల్లడించారు.

Next Story

RELATED STORIES