ఫ్రెండ్ అని ఇంటికి రానిస్తే.. ఎంతకి తెగించాడంటే..!

వివాహేతర సంబంధాల మోజులో పడిపోయి కొందరు బంధాలకి విలువ ఇవ్వడం లేదు. కట్టుకున్న భర్తను సైతం కడతేర్చేందుకు కూడా వెనుకాడడం లేదు

ఫ్రెండ్ అని ఇంటికి రానిస్తే.. ఎంతకి తెగించాడంటే..!
X

వివాహేతర సంబంధాల మోజులో పడిపోయి కొందరు బంధాలకి విలువ ఇవ్వడం లేదు. కట్టుకున్న భర్తను సైతం కడతేర్చేందుకు కూడా వెనుకాడడం లేదు. తాజాగా కర్ణాటకలోని కెంపగౌడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. పోలీసులకి ఆమె పైన అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారణ చేయగా మొత్తం కథ బయటపడింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. కార్తీక్, రంజిత భార్యాభర్తలు వీరికి కొన్నేళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. కార్తీక్ వృత్తిరిత్యా ఆటో డ్రైవర్.. అయితే కార్తీక్‌‌కి, సంజీవ్‌ అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతనిని నమ్మడమే కార్తీక్ తప్పింది. సంజీవ్‌‌ని ఇంటికి పిలిచిన కార్తీక్ తన భార్యను మీ చెల్లి అంటూ పరిచయం చేశాడు. అయితే కార్తీక్ పెట్టుకున్న నమ్మకాన్ని తన భార్య, స్నేహితుడు ఇద్దరూ వమ్ము చేశారు. వరుసుల మరిచిపోయి ఒకరికొకరు దగ్గరయ్యారు. కార్తీక్ లేని సమయంలో ఇద్దరు దొంగచాటుగా కలుసుకునేవారు.


ఇలా కొన్నిరోజులు సాగింది. ఈ విషయం భర్తకు తెలిస్తే ఇబ్బందులు తప్పవని రంజిత భావించడంతో కార్తీక్ అడ్డు తొలిగించాలని ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే సంజీవ్ మరో స్నేహితుడి సహాయం తీసుకోని కార్తీక్‌ను పార్టీ పేరుతో పిలిచి హత్య చేశాడు. అనంతరం అతని మృతదేహాన్ని వృషభవతి నదిలో పడేశారు. ఆ తర్వాత రంజీత తన భర్త కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదు చేసింది.

అయితే ఆమె కుట్రను బట్టబయలు చేయడానికి పోలీసులకి ఎంతో సమయం పట్టలేదు. తమదైన శైలిలో విచారణ చేయగా రంజీత మొత్తం చెప్పేసింది. దీనితో ముగ్గురి పై కేసు నమోదు చేసి జైలకి తరలించారు పోలీసులు.

Next Story

RELATED STORIES