క్రైమ్

Bihar Nurse : బిహార్‌లో ఓ నర్సు నిర్వాకం... ఖాళీ సిరంజీతో ఇంజక్షన్..!

Bihar Nurse : బిహార్‌లో ఓ నర్సు టీకా మందు లేకుండానే ఖాళీ సిరంజీతో గుచ్చేసింది.

Bihar Nurse : బిహార్‌లో ఓ నర్సు నిర్వాకం... ఖాళీ సిరంజీతో ఇంజక్షన్..!
X

Bihar Nurse : బిహార్‌లో ఓ నర్సు టీకా మందు లేకుండానే ఖాళీ సిరంజీతో గుచ్చేసింది. మాటల్లో పడి వ్యాక్సిన్‌ బుడ్డీ తీసుకోవడం మరిచిపోయిందో, లేక కావాలనే నటించిందో తెలీదు గాని.. ఖాళీ సిరంజితోనే ఇంజక్షన్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఉన్నతాధికారులు యాక్షన్‌లోకి దిగారు.

తన స్నేహితుడు వ్యాక్సిన్ వేయించుకుంటుండడంతో.. సరదాగా వీడియో తీశాడు. ఆ తరువాత చూస్తే.. అసలు వ్యాక్సినే ఇవ్వలేదని తేలింది. సిరంజీపై ఉన్న ప్లాస్టిక్ కవర్ తొలగించిన నర్సు.. వ్యాక్సిన్ మందు తీసుకోకుండానే.. ఖాళీ సిరంజీతోనే ఇంజెక్షన్ ఇచ్చినట్లు చాలా స్పష్టంగా కనిపించింది. వెంటనే వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి అధికారులకు సమాచారం అందించాడు. ఖాళీ సిరంజీతో ఇంజెక్షన్ చేసిన నర్సును విధుల నుంచి తొలగించారు అధికారులు.

ఖాళీ సిరంజీతో ఇంజెక్షన్ చేసినందువల్లనో ఏమో.. తనకు తీవ్ర తలనొప్పి మొదలైందంటూ డాక్టర్‌ దగ్గరికి వెళ్లాడు ఆ యువకుడు. ఏదైనా సమస్య ఉంటే ఆస్పత్రికి రావాలని బాధిత యువకుడికి ముందుగానే వైద్య సిబ్బంది చెప్పారు.

Next Story

RELATED STORIES