మిస్సైన ఐదేళ్ల బాలుడు.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన మృతదేహం లభ్యం

మిస్సైన ఐదేళ్ల బాలుడు.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన మృతదేహం లభ్యం
X

హైదరాబాద్‌ శామీర్‌ పేట్‌లో విషాదం చోటు చేసుకుంది.. ఈ నెల 15వ తేదీన అదృశ్యమైన ఐదేళ్ల బాలుడు అధియాన్‌ మృతదేహం లభ్యమైంది. శామీర్‌పేట్‌ సమీపంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. వెంటనే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న బీహార్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడితో కలిసి అధియాన్‌ వీడియో షూట్‌కు వెళ్లినట్టు గుర్తించారు.. ఓ బిల్డింగ్‌ పై దూకినట్టు యాక్ట్‌ చేస్తున్న సమయంలో అధియాన్‌ ప్రమాదవశాత్తూ కింద పడి.. తలకి గాయమై మృతి చెందినట్టు తెలుస్తోంది.

బాలుడి మృతి చెందినట్టు గుర్తించిన 17 ఏళ్ల యువకుడు.. వెంటనే ఆ ఘటను దాచిపెట్టే ప్రయత్నం చేశాడు.. అక్కడితో ఆగకుండా బాలుడి తల్లి దండ్రులు ఫోన్‌ చేసి.. అధియానను కిడ్నాప్‌ చేశామని.. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.. బాలుడు అదృశ్యమైన రోజే.. అధియాన్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయినా ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు అలసత్వం వహించారని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మృతి ప్రమాదమా..? హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. 17 ఏళ్ల యువకుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


Next Story

RELATED STORIES