చెల్లిపై లైంగిక దాడి చేసిన ఇద్దరు అన్నలు

చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అన్నలు. ఒకరు పేగు పంచుకు పుట్టిన వారు కాగా, మరొకరు స్వయానా పెద్దమ్మ కొడుకు.

చెల్లిపై లైంగిక దాడి చేసిన ఇద్దరు అన్నలు
X

ఆ యువతికి వరుసకు వాళ్లిద్దరూ అన్నయ్యలే. ఒకరు పేగు పంచుకు పుట్టిన వారు కాగా, మరొకరు స్వయానా పెద్దమ్మ కొడుకు. చెల్లికి కష్టం వస్తే తీర్చాల్సిన వాళ్లు.. ఆమెనే కష్టాల పాలు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి లైంగిక వేధింపులకు దిగారు. సొంత అన్న నిర్వాకాన్ని భరించలేక పెద్దమ్మ వాళ్లింటికి వెళ్తే.. అక్కడ వాళ్ల కొడుకు కూడా తనలో ఓ చెల్లిని చూడకుండా శారీరకంగా వేధింపులకు దిగాడు. ఇంట్లో పెద్దోళ్లతో చెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రక్షణ కల్పించడంటూ బాధిత యువతి పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.

ఈ అమానుష ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగింది. ఆ బాధిత యువతి తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. దీంతో యువతి, అన్నను తల్లే అన్నీ తానై పెంచింది. అయితే ఆమె తొమ్మిదో తరగతి చదివేటప్పటి నుంచే తన అన్న లైంగిక వేధింపులకు పాల్పడేవాడని బాధితురాలు ఆరోపించింది. అత్యాచారానికి ఒడిగట్టేవాడని పేర్కొంది. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడని.. అన్నయ్య పెట్టే బాధలు భరించలేక, కొత్తగూడెంలోనే ఉన్న పెద్దమ్మ వాళ్లింటికి వెళితే... ఆ ఇంట్లోనూ ఓ కామాంథుడు ఉన్నాడని చెప్పింది. తన పెద్దమ్మ కుమారుడు కూడా లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టాడని.. అత్యాచారం చేస్తూ వచ్చాడని తెలిపింది.

పెద్దమ్మ, పెదనాన్నలకు చెబితే ఇదంతా ఈ రోజుల్లో కామన్ అని దారుణంగా మాట్లాడారని వాపోయింది. తన తల్లి కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మెడిసిన్ ఎంట్రన్స్ కోచింగ్ కోసం ఆ యువతి వేరే ప్రాంతానికి వెళ్లింది. అయితే లాక్ డౌన్ వల్ల తిరిగి ఇంటికి రావడంతో.. మళ్లీ అన్న అఘాయిత్యానికి బలయ్యాయని తెలిపింది. ఈ వేధింపులు తాళలేని బాధిత యువతి.. తన వాళ్ల నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.


Next Story

RELATED STORIES