ఆవేశం.. రోజుల బిడ్డకు తండ్రిని దూరం చేసింది..

ద్విచక్రవాహనదారుడితో అయిన చిన్న గొడవ ప్రకాష్ ప్రాణాలు తీసింది. రోజుల బిడ్డకు తండ్రిని దూరం చేసింది.

ఆవేశం.. రోజుల బిడ్డకు తండ్రిని దూరం చేసింది..
X

అమ్మాయి పుట్టిందని ఆనందంగా ఇంటికి వెళ్లాడు.. పుట్టి పది రోజులైన ఆ చిన్నారిని చూసి మురిసిపోయాడు. పచ్చి బాలింతైన భార్యకు జాగ్రత్తలు చెప్పి బయలు దేరాడు క్యాబ్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రకాష్. ద్విచక్రవాహనదారుడితో అయిన చిన్న గొడవ ప్రకాష్ ప్రాణాలు తీసింది. రోజుల బిడ్డకు తండ్రిని దూరం చేసింది.

పెళ్లై ఏడాది కూడా కాని ఆ ఇల్లాలికి భర్తని దూరం చేసింది. ఆవేశం ఎంతటి అనర్ధానికి దారి తీస్తుందో ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో నివసించే గంగాదేవి ప్రకాశ్ (23) క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పది రోజుల కిందట భార్య.. పాపకు జన్మనివ్వడంతో నారాయణపురం వెళ్లాడు.

కూతుర్ని చూసి మురిసిపోయాడు. పాలుగారే పసిబిడ్డను చేతుల్లోకి తీసుకుని ముద్దు చేశాడు. తనవి తీరా భార్యా బిడ్డని రెండు రోజులు చూసుకుని భాగ్యనగరానికి బయలుదేరాడు విధులు నిర్వహించేందుకు. డ్యూటీలో భాగంగా క్యాబ్‌లో బుక్ చేసిన కస్టమర్‌ని ఎక్కించుకునేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 2లో వాహనాన్ని పక్కకు ఆపి ఎదురు చూస్తున్నాడు.

ఇంతలో మోతీనగర్‌లో నివసిస్తున్న విజయవాడకు చెందిన ప్రేమ్ కుమార్ వంగ (20) ద్విచక్రవాహనంపై వచ్చి క్యాబ్‌ను ఢీకొట్టాడు. దాంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ ప్రకాశ్ ఈ విషయాన్ని ఫోన్‌లో స్నేహితుడికి వివరిస్తున్నాడు. ఇంతలో ద్విచక్రవాహనదారుడు ప్రేమ్ కుమార్ పక్కనే ఉన్న సిమెంట్ రాయితో ప్రకాశ్ తలపై గట్టిగా కొట్టాడు.

ఇదంతా ప్రకాశ్ ఫోన్ కాల్‌లో రికార్డయింది. తీవ్రంగా గాయపడిన ప్రకాశ్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES