నరమాంస భక్షకులు హల్‎చల్..పుర్రెలతో నృత్యాలు

Tamil nadu: తమిళనాడులో నరమాంస భక్షకులు సంచరిస్తున్న వార్తలతో అక్కడి ప్రజలకు కంటిమిద కునుకు ఉండటం లేదు.

నరమాంస భక్షకులు హల్‎చల్..పుర్రెలతో నృత్యాలు
X

Tamil nadu: మనుషుల మృతదేహాలను పీక్కుతినే నరమాంస భక్షకుల గురించి మనం సినిమాల్లోనే చూసి ఉంటాం. అయితే తమిళనాడులో నరమాంస భక్షకులు సంచరిస్తున్న వార్తలతో అక్కడి ప్రజలకు కంటిమిద కునుకు ఉండటం లేదు. కొందరు మాంత్రికులు పుర్రెతో నృత్యాలు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాశిలోని కల్లురాణి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. కల్లురాణి గ్రామంలో కొంతమంది మాంత్రికులు మనిషి పుర్రెలతో డ్యాన్సులు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మంత్రికులు నరమాంసం తిన్నారన్న అభియోగంపై పోలీసులు 10మందిపై కేసులు నమోదు చేశారు.

ఆ గ్రామంలోని 10 మంది మాంత్రికులు రాత్రి సమయంలో సగం కాలిన మృతదేహాన్ని భక్షిస్తూ.. ఊరంతా తిరగసాగారు.ఆ సమయంలో మాంత్రికులు మత్తులో ఉన్నారని, ఆ గ్రామ దేవత వారిని ఆవహించిందని పేర్కొంటున్నట్టు పోలీసులు తెలిపారు. కట్టు కోవిల గుడిలో ఎవరి మృతదేహాన్ని భక్షించారో తెలుసుకొనేందుకు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

అయితే వారు ఏదైనా గ్రామంలోని శ్మశానవాటిక.. నుంచి శవాన్ని తీసుకొచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎప్పుడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే అంశంపై పోలీసులకు.. ఇంకా ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు. కల్లురాణి గ్రామ పాలనాధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కల్లురాణి గ్రామంలోనే 2019లో కూడా కొందరు వ్యక్తులు మనిషి పుర్రెను తీసుకొచ్చి నృత్యాలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

Next Story

RELATED STORIES