కాలేజీ లెక్చరర్ స్పెషల్ క్లాసెస్ పేరుతో విద్యార్ధినులకు కాల్ చేసి..

క్లాసులో చెప్పే పాఠాలు మీకు అర్థం కాకపోతే స్పెషల్ క్లాసులకు రండి.. మీకు బాగా అర్థమయ్యేలా క్లాసులు చెబుతానన్నాడు లెక్చరర్. సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామనుకున్నారు కాలేజీ అమ్మాయిలు. కానీ లెక్చరర్ మనసులోని ఆంతర్యాన్ని గ్రహించలేకపోయారు. హన్మకొండలోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీలో రంజిత్ కుమార్ అనే వ్యక్తి లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. క్లాసులకు వచ్చేటట్లయితే ముందుగా కాల్ చేసి చెప్పండి అని అందరికీ నెంబర్ ఇచ్చాడు. దాంతో పలువురు విద్యార్థినులు లెక్చరర్‌కి కాల్ చేసి క్లాసులకు హాజరవుతామని చెప్పారు. విద్యార్థినుల సెల్ నెంబర్లకి అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టడం, క్లాసులకు వచ్చిన అమ్మాయిలను లైంగికంగా వేధించడం చేస్తున్నాడు. దీంతో పలువురు విద్యార్థినులు ధైర్యం చేసి విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కాలేజీకి వెళ్లి లెక్చరర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *