వంట మనిషి అరాచకం.. యజమానికి భోజనంలో మత్తుమందు పెట్టి..

వంట మనిషి అరాచకం.. యజమానికి భోజనంలో మత్తుమందు పెట్టి..
X

భాగ్యనగరంలో నేపాలీ గ్యాంగ్ మరోసారి హల్ చల్ చేసింది. వాచ్‌మెన్‌, వంటమనుషులుగా చేస్తూ ఇంటికి కన్నం వేశారు. తాజాగా రాయదుర్గంలో నేపాలీ దంపతులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి డిన్నర్‌లో ఇంటియజమానికి మత్తుమందు కలిపి 30లక్షల సొత్తుతో ఉడాయించారు. ఇంట్లో పనిమనుషులుగా చేరి ఈ దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన నగరంలో ఇది మూడోసారి. గతంలో జనవరిలో కోకాపేటలోమత్తుమందు ఇచ్చి కోటికిపైగా నగదు చోరీ చేశారు. ఆగస్టులో సైనిక్ పురిలో ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులు దర్యాప్తుచేస్తుండగానే రాయదుర్గంలోని డిఎన్‌ ఆర్ హిల్స్‌లో దోపిడీకి దిగారు. బోర్ వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధు సూధన్ రెడ్డి ఇంట్లో 15లక్షల నగదు, బంగారం చోరీకి పాల్పడిందిఈ నేపాలి గ్యాంగ్.

Next Story

RELATED STORIES