హాస్టల్ వార్డెన్ సాక్షిగా... బ్యాచ్‌లుగా విడిపోయి కొట్టుకున్న హాస్టల్ విద్యార్ధులు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీసీ హాస్టల్ విద్యార్ధులు.. బ్యాచ్‌లుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. దాదాపు గంటకు పైగా విద్యార్ధులు వీరంగం సృష్టించారు.

హాస్టల్ వార్డెన్ సాక్షిగా... బ్యాచ్‌లుగా విడిపోయి కొట్టుకున్న హాస్టల్ విద్యార్ధులు..!
X

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీసీ హాస్టల్ విద్యార్ధులు.. బ్యాచ్‌లుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. దాదాపు గంటకు పైగా విద్యార్ధులు వీరంగం సృష్టించారు. హాస్టల్ వార్డెన్ సాక్షిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి పోలీసులు రావడంతో విద్యార్ధులు శాంతించారు. కాని, పోలీసులు వచ్చి సర్దిచెప్పి వెళ్లిపోయిన తరువాత.. విద్యార్ధులు మరోసారి రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.

పాల్వంచలోని బొలోరిగూడెంలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌లో కొందరు విద్యార్ధులు మందు, సిగరెట్‌కు అలవాటు పడ్డారు. హాస్టల్‌కు దగ్గర్లో ఉన్న షాపుల నుంచి మద్యం బాటిళ్లు తెచ్చుకుంటున్నారు. వీళ్లు మందు కొట్టి, సిగరేట్‌ తాగుతున్నారన్న విషయాన్ని కొంత మంది విద్యార్ధులు లీక్ చేశారు. దీంతో వ్యసనాలకు బానిసైన బ్యాచ్‌.. ఏ అలవాట్లు లేని మరో బ్యాచ్‌పై దాడికి దిగారు.

విషయం విద్యార్ధుల తల్లిదండ్రులకు తెలియడంతో పరుగుపరుగున వచ్చారు. అయినా సరే విద్యార్థులు ఆగలేదు. పోలీసులు అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నించారు. గొడవకు కారణమైన వారిపై గాని, వార్డెన్‌పై గాని చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడంపై విద్యార్ధుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES