Warangal: బార్‌లో తల్వార్‌తో హల్‌చల్‌

Warangal: బార్‌లో తల్వార్‌తో హల్‌చల్‌

వరంగల్‌ అఖిల్‌ బార్‌లో మధు అనే వ్యక్తి తల్వార్‌తో హల్‌చల్‌ చేశాడు. ఫుల్‌బాటిల్ ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. అప్పటికే మత్తులో ఉన్న అతగాడు తల్వార్ తిప్పుతూ బార్‌ సిబ్బందిని కంగూరు పెట్టాడు. భయాందోళనకు గురిచేశాడు. ఇంతలో బార్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో....వారు స్పాట్‌కు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందే బార్‌లో మధు ఫుల్‌గా మందు తాగాడు. తనకు ఇంకా మందు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బార్ క్యాషియర్ అందుకు నిరాకరించాడు. అప్పటి వరకు తాగిన మందు డబ్బులు చెల్లించాలన్నాడు. దీంతో మధు ఆగ్రహంతో ఊగిపోయాడు. బార్ క్యాషియర్‌తో వాదనకు దిగాడు.తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయాడు.

కొంత సేపటికి మళ్లీ బార్‌కు ఓ తల్వార్ చేత పట్టుకుని మధు తిరిగివచ్చాడు. తనకు ఫుల్ బాటిల్ కావాలని తల్వార్‌తో బెదిరిస్తూ అడిగాడు. దీంతో బార్ నిర్వాహకులు, అక్కడే ఉన్న మరికొందరూ ఆందోళనకులోనయ్యారు. బార్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వేగంగా స్పాట్‌కు వచ్చారు. మధు పోలీసులనూ బెదిరించాడు. ఫుల్ బాటిల్ ఇస్తేనే తిరిగి వెళ్లిపోతానంటూ కండీషన్ పెట్టాడు. పోలీసులు అతడిని తమ మార్గంలోకి తెచ్చుకోవడానికి నానా ప్రయత్నాలు చేసి విసుగు చెందారు. చివరకు అతణ్ని మాటల్లోకి దించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గతంలో ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. ప్రస్తుతం కొబ్బరి బోండాల వ్యాపారం చేస్తున్నాడు. ఇది వరకే మధుపై రౌడీ షీట్ ఉందని పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story