ఇన్‌స్టెంట్ మనీ యాప్‌పై పోలీసులు కొరడా

ఇన్‌స్టెంట్ మనీ యాప్‌పై పోలీసులు కొరడా

ఆన్ లైన్ కాల్ మనీ యాప్‌లపై దేశవ్యాప్తంగా కొరడా ఝుళిపిస్తున్నారు పోలీసులు. దేశంలో మూడు ప్రదేశాల్లోని కాల్‌ సెంటర్లపై దాడులు చేశారు. లోన్‌ యాప్‌ల వేధింపులపై భారీగా ఫిర్యాదులు అందడంతో సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హైదరాబాద్ 39, సైబరాబాద్ 120, రాచకొండ 60 పైగా కేసులు నమోదు చేశారు. ఇక గుర్గావ్, ఢిల్లీలోని మనీ యాప్‌ కార్యాలయాలపై దాడులు చేశారు. సాఫ్ట్ వేర్ సునీల్ ఆత్మహత్య కేసులో ఢిల్లీలో ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.ఈ మనీ యాప్ లకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించారు పోలీసులు. కొందరు నిర్వాహకులు 60 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్‌లో.. పంజాగుట్ట, బేగంపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఆర్బీఐ, ఎన్బీఎఫ్‌సీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మూడు కాల్‌సెంటర్లను పోలీసులు గుర్తించారు. ఈ 3 కాల్‌ సెంటర్లలో కలిపి దాదాపు 650 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి 41 సీఆర్‌పీసి కింద నోటీసులిచ్చారు. 16 యాప్‌ల ద్వారా వందల సంఖ్యలో రుణాలు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బేగంపేట్‌లోని ఓ అపార్ట్మెంట్ లో ఏకంగా 32 యాప్‌ల నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆనియన్ క్రెడిట్, క్రెడ్ ఫాక్స్ కంపెనీల ప్రతినిధులను అరెస్ట్‌ చేశారు. క్యాష్ మామా, హే ఫిష్, మంకీ క్యాష్, క్యాష్ ఎలిఫాంట్, లోన్ జోన్, క్యాష్ జోన్ పేర్లతో యాప్‌లు నిర్వహిస్తున్నారు. వీటిన్నింటిని ఆనియన్ క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్, క్రెడ్ ఫ్యాక్స్ టెక్నాలజీ సీఈవో కొనతం శరత్ చంద్ర, డైరెక్టర్ పుష్పలత నిర్వహిస్తుండటంతో.. వారిద్దరిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.

ఆన్‌లైన్‌ రుణాల పేరుతో ఉన్న అనుమతి లేని యాప్స్‌ను నమ్మోద్దని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రజలకు సూచించారు. రకరకాల పేర్లతో ఆకర్షిస్తున్నారని, తక్కువ సమయంలో డబ్బులిచ్చే సంస్థలన్నీ మోసపూరితమైనవేనన్నారు. ఆన్‌లైన్‌ లోన్‌ ఇచ్చి వేధిస్తోన్న కేసులో.. ఆరుగురిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

మరోవైపు.. గత 24 గంటల్లో వందకుపైగా బాధితులు ఫిర్యాదులు చేయడంతో.. రంగంలో దిగారు సీసీఎస్‌ పోలీసులు. ఈ మనీ యాప్‌ నిర్వహాకులు.. లోన్ తీసుకున్నవారి కాంటాక్ట్‌ లిస్ట్‌లకు సైతం మేసేజ్‌ పంపిపుతున్నారు. షూరిటీ గా మీ నెంబర్ ఉన్నందున లోన్ చెల్లించాలంటూ వారికి మెసేజ్‌లు వస్తుండటంతో.. ఆశ్చర్యపోరుతున్నారు జనం. తమకు తెలియకుండానే తమ నెంబర్ షూరిటీ ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. పైగా కేసులు పెడతామంటూ బెదిరిస్తుండటంతో.. మరింత టెన్షన్‌ పడుతున్నారు.



Tags

Read MoreRead Less
Next Story