దీక్షిత్‌రెడ్డి మర్డర్ కేసు రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు..

దీక్షిత్‌రెడ్డి మర్డర్ కేసు రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు..

మహబూబాబాద్‌లో చిన్నారి దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్ అండ్ మర్డర్ కేసు రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలున్నాయి. నిందితుడు మందసాగర్‌ ఏడాది నుండి 'డింగ్‌ టాక్' యాప్‌ వాడుతున్నాడు. గతంలో గర్ల్ ఫ్రెండ్‌కు ఫోన్ చేసేందుకు, అమ్మాయిల్ని వేధించేందుకు కూడా ఇదే యాప్ వాడాడు. అప్పుడు తాను దొరకలేదు కాబట్టి ఆ ధైర్యంతో ఇప్పుడు బాలుడిని కిడ్నాప్ చేశాక.. పేరెంట్స్‌కి దాన్నుంచే కాల్ చేశాడు. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్దామని చెప్పి బాలుడిని తీసుకెళ్లిన మందసాగర్.. తర్వాత బాలుడిని చంపేశాడు. పథకం ప్రకారం ముందే నిద్రమాతలు కొనడం, వాటర్ బాటిల్‌లో వాటిని కలిపి దీక్షిత్‌తో తాగించడం అంతా ప్లాన్ ప్రకారం చేశాడు. ఐతే.. దొరికిపోతాననే భయంతో బాలుడిని చంపేశాడు.

Tags

Read MoreRead Less
Next Story