పుట్టిన రోజు వేడుకల కోసం డిగ్రీ విద్యార్థినిని లాడ్జ్‌కి తీసుకెళ్లి..

పుట్టిన రోజు వేడుకల కోసం డిగ్రీ విద్యార్థినిని లాడ్జ్‌కి తీసుకెళ్లి..
X

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ముగ్గురు యువకులు.. స్నేహితురాలైన డిగ్రీ విద్యార్థినిని పుట్టిన రోజు వేడుకలకని తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. కేక్‌లో మత్తుమందు కలిపి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూబ్లీహిల్స్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న 19 ఏళ్ల యువతి.. సికింద్రాబాద్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. తమ ఇంటి పరసరాల్లో ఉండే జోసెఫ్‌, రాము, నవీన్‌ ఆమెకు స్నేహితులయ్యారు. ఈ నెల 5న ఫీజు కట్టేందుకు కాలేజీకి వెళ్లగా.. పుట్టిన రోజు వేడుకల కోసం KPHBలోని ఓ లాడ్జ్‌కి తీసుకెళ్లారు. పథకం ప్రకారం కేకుపై మత్తుమంది చల్లిన యువకులు.. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు.

అత్యాచార ఘటన తర్వాత.. బాలిక అస్వస్థతకు గురైంది. ఈ నెల 11న ఆపస్మారకస్థితిలో వెళ్లగా.. తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. వారు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. దీనికి సంబంధించి ముగ్గురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES