దివ్యను హత్య చేసింది నాగేంద్రబాబేనన్న ఫోరెన్సిక్ నివేదిక

దివ్యను హత్య చేసింది నాగేంద్రబాబేనన్న ఫోరెన్సిక్ నివేదిక
X

విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య హత్య కేసు మిస్టరీ ఓ కొలిక్కి వచ్చింది. ఫోరెన్సిక్‌ నివేదిక కీలక విషయాన్ని వెల్లడించింది. దివ్యను హత్య చేసింది నాగేంద్రబాబేనని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. దివ్య గాయాలు సొంతంగా చేసుకున్నవి కావని తెలిపింది. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించిన బెజవాడ పోలీసులు.. 26న ఛార్జీషీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. దివ్య హత్య అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు నాగేంద్రబాబు.. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిశ్చార్జి చేస్తే నిందితున్ని అదుపులోకి తీసుకోనున్నారు పోలీసులు.


Next Story

RELATED STORIES