వికటించిన వైద్యం.. ఒకే కుటుంబంలో 8 మంది మృతి.. !

ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

వికటించిన వైద్యం.. ఒకే కుటుంబంలో 8 మంది మృతి.. !
X

ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో విషాదం చోటుచేసుకుంది. వైద్యం వికటించి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హోమియోపతి మందుతాగడం వల్లే మరణాలు సంభవించినట్లుగా పోలీసులు చెప్పారు. ఈ మందును వారికి ఇచ్చిన డాక్టర్ పరారీలో ఉన్నాడు. కరోనా నివారణ కోసమే వారు ఈ ఔషధాన్ని తీసుకున్నారని పోలీసులు తెలిపారు.వీళ్లంతా డ్రోసెరా 30 అనే ఔషధం తీసుకోగా.. అందులో 91 శాతం నాటుసారా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఈ డ్రెసెరా 30 ఔషధాన్ని అనేక అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. గొంతునొప్పి, దగ్గు, శ్వాసకోశ సమస్యలు, కీళ్ల నొప్పుల నివారణ కోసం దీనిని ఉపయోగిస్తారు. అటు మృతుల్లో నలుగురికి రాత్రి అంత్యక్రియలు జరగడంతో ఈ కేసు అనుమానాస్పదంగా మారింది.

Next Story

RELATED STORIES